Andhra Pradesh
వల్లభనేని వంశీ ఎలా అయిపోయారో చూడండి!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. గత ఫిబ్రవరి 13 నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన పూర్తిగా మారిపోయారు. తెల్లజుట్టు, విపరీతమైన దగ్గు, బలహీనమైన శరీరంతో ఆయన కనిపిస్తున్నారు. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వంశీ, జైలులో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కోర్టుకు వివరించారు. రాత్రి సమయాల్లో తన పల్స్ రేటు ఒక్కసారిగా పడిపోతోందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో, నిన్న వల్లభనేని వంశీకి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శ్వాసకోశ సమస్యలు, కాళ్ల వాపు, హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలను వైద్యులు గుర్తించినట్లు సమాచారం. వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ, ఆయనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరినట్లు తెలిపారు. జైలు వాతావరణం ఆయన ఆరోగ్యానికి హాని కలిగిస్తోందని, వెంటనే తగిన చికిత్స అందించాలని ఆమె డిమాండ్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వంశీకి ఇటీవల బెయిల్ మంజూరైనప్పటికీ, మరికొన్ని కేసుల కారణంగా ఆయన ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు.