Andhra Pradesh

లిక్కర్‌ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. నిందితుల ఆస్తుల జప్తునకు  కోర్టు అనుమతి | Vijayawada acb court key orders in ap liquor scam case  nk-10TV Telugu

లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్‌ చేస్తూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, శ్రీనివాస్, పైలా దిలీప్‌తో పాటు వరుణ్‌, చెవిరెడ్డి, ఎంపీ డిస్టిలరీస్‌, SNJ షుగర్స్‌ సంస్థలకు నోటీసులు వెళ్లాయి. అలాగే SBI, ICICI బ్యాంకులు, విజయవాడ ట్రెజరీ అధికారికి కూడా ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది.

ఇక సిట్‌ పిటిషన్‌పై వరుణ్ పురుషోత్తం ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపాడు. అదే విధంగా SNJ షుగర్స్‌, ఎంపీ డిస్టిలరీస్‌ ప్రతినిధులు కూడా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version