Latest Updates
లాల్ బజార్ నాగమ్మ ఆలయం ప్రత్యేకత మీకు తెలుసా?
కంటోన్మెంట్ పరిధిలోని లాల్ బజార్ సమీపంలో ఉన్న నాగమ్మ దేవాలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఆలయ చరిత్ర బ్రిటిష్ కాలం నాటి నుంచే ప్రారంభమైందని భక్తులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం నాగులచవితి సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని, నాగదోషం వంటి దోషాలు తొలగిపోతాయని భక్తుల గాఢ విశ్వాసం. ఈ రోజు వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని పూజారి తెలిపారు.