Education

రోజువారీ ఆహారంలో సహజమైన ఆరోగ్య మిత్రులు

మీ ఆహారం కోసం ఆరోగ్యకరమైన ఎంపికగా ఉండే 7 చైనీస్ వంటకాలు - రెస్టారెంట్ ఇండియా

మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యాన్ని కాపాడే శక్తి దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. పౌష్టిక విలువలతో నిండిన కొన్ని ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సహజమైన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మసాలా పదార్థాలు శరీరానికి రక్షణగా నిలుస్తాయని అంటున్నారు.

ఆహారంలో సజ్జలు చేర్చుకోవడం ద్వారా పైల్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మామిడిపండ్లు క్రమం తప్పకుండా తినడం ద్వారా కిడ్నీల్లో ఏర్పడే రాళ్లు కరిగి పోవడమే కాకుండా మూత్ర సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయని వైద్యులు తెలిపారు. అదేవిధంగా దానిమ్మ రసం రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా కామెర్ల (జాండిస్) వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

రోజువారీ వంటల్లో ఆవాలు చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి మధుమేహ నియంత్రణకు తోడ్పడతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల సహజమైన ఈ ఆహార పదార్థాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version