Andhra Pradesh

మోదీ–లోకేశ్‌ల వరుస భేటీలు.. అసలు కారణమిదేనా?

Lokesh Calls on PM Modi, Seeks Greater Central Support for AP

ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడం ముఖ్యమంత్రులకే కష్టసాధ్యమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మాత్రం వరుసగా సమయం కేటాయించడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.

టీడీపీ వర్గాలు ఈ భేటీలు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల కోసమేనని స్పష్టం చేస్తున్నా, రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరే కోణంలో విశ్లేషిస్తున్నారు. బీజేపీతో దీర్ఘకాలిక పొత్తు బలపడే సంకేతాలుగా ఈ సమావేశాలను అర్థం చేసుకుంటున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టగా, పార్టీ భవిష్యత్ నాయకుడైన లోకేశ్ జాతీయ స్థాయిలో తన పట్టు పెంచుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. ఈ వరుస భేటీలతో టీడీపీ–బీజేపీ సంబంధాలు మరింత బలపడతాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version