National

ముంబైలో రికార్డ్ స్థాయి వర్షం: 107 ఏళ్ల చరిత్రలో కొత్త రికార్డు

TS News: గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు | In  the last 10 years record rainfall has been recorded in summer PVCH

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాన్సూన్ తొలిరోజైన సోమవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. నెలంతా కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ముంబైలోని కొలబా ప్రాంతంలో 295 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. ఇది ముంబై చరిత్రలో అత్యధిక వర్షపాతంగా నిలిచింది.

గతంలో 1918లో 279 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, 107 ఏళ్లుగా అదే అత్యధిక రికార్డుగా కొనసాగింది. తాజాగా ఈ రికార్డు బద్దలైంది. కుండపోత వానల కారణంగా ముంబై మహానగరం నీట మునిగింది. రోడ్లు, ఇళ్లు జలమయమై, జనజీవనం స్తంభించింది. ఈ అసాధారణ వర్షపాతం నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తూనే, వాతావరణ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version