Entertainment
మిరాయ్ సినిమాలో శ్రీరాముడిగా ఆ స్టార్ హీరోనా..? థియేటర్స్‌లో గూస్‌బంప్స్ గ్యారెంటీ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. చిన్నతనం నుంచే స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తేజ, ఇప్పుడు హీరోగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఓ బేబీలో కీలక పాత్రతో మెప్పించిన తేజ, తర్వాత జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్‌లోనే కాక ఇండియన్ సినిమా రేంజ్‌లోనూ కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు తేజ మరో విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే మిరాయ్. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
మిరాయ్ ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన మిరాయ్ ట్రైలర్ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌తో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తేజకి మరో హిట్ ఖాయం అనిపించేలా ట్రైలర్ ఉంది.
శ్రీరాముడి ఎంట్రీతో సస్పెన్స్..!
ట్రైలర్‌లో శ్రీరాముడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూపించారు. హీరోకి శ్రీరాముడు సాయం చేసినట్టు చూపించడంతో ఆడియన్స్‌లో కుతూహలం పెరిగిపోయింది. అయితే రాముడి పాత్రను ఎవరు చేశారు అనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు ఆ పాత్రను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో క్రియేట్ చేశారని అంటుంటే, మరికొందరు మాత్రం ఒక స్టార్ హీరోనే రాముడిగా నటించాడని టాక్ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ నటుడిని రాముడి పాత్ర కోసం తీసుకొచ్చారని టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.
హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి క్యారెక్టర్‌ను చూపించి, చూపించకుండా హైప్ క్రియేట్ చేసినట్టే మిరాయ్లో రాముడి పాత్ర కూడా మిస్టరీగానే ఉంచారు. మరి శ్రీరాముడిగా నిజంగా ఎవరు నటించారు..? లేక వీఎఫ్ఎక్స్ మాయలోనే ఆ పాత్ర క్రియేట్ అయ్యిందా..? అన్నది సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్ గానే మిగిలిపోనుంది.