Andhra Pradesh
‘మారుతీ’ రికార్డు.. ఒకేరోజు 25 వేల కార్ల డెలివరీ!

GST సంస్కరణల అమలు, పండగ సీజన్ నేపథ్యంలో దేశంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 25 వేల కార్లు డెలివరీ ఇచ్చినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈనెల 18 నుంచి ఇప్పటివరకు 75 వేల బుకింగ్స్ వచ్చాయంది. 35 ఏళ్లలో ఇంతటి స్పందన ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. మరోవైపు టాటా తొలి రోజు 10 వేల కార్లు డెలివరీ చేసింది. ఒకేరోజు 11 వేల అమ్మకాలు జరగడం ఐదేళ్లలో ఇదే తొలిసారి అని హ్యుందాయ్ వెల్లడించింది