News
మలక్ పేటలో భారీగా ట్రాఫిక్ జామ్.. కదిలిన యంత్రాంగం
మలక్‌పేట – చాదర్‌ఘాట్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ ఓవర్‌ఫ్లో కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు చేరడంతో వాహనాలు కదలడం కష్టంగా మారింది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు శనివారం GHMC కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ మలక్‌పేటలో పర్యటించారు. వారు మెట్రో పిల్లర్ నం.1417 నుంచి 1420 వరకు డ్రైనేజీ లీకేజీని గుర్తించారు. ఈ సమస్యను వెంటనే సరిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో త్వరలోనే ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.