Latest Updates

మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ఎంఎస్ఎంఈలపై మంత్రి శ్రీధర్​బాబు కీలక వ్యాఖ్యలు | Minister Sridhar Babu key  comments on MSMEs

హైదరాబాద్‌: నందిగామ పరిధిలోని కన్హ శాంతి వనంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ దర్యాప్తుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే జ్యూడిషియల్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వారు సమర్పించిన నివేదిక ఆధారంగానే కేసును సీబీఐకి అప్పగించామని తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ, “జ్యూడిషియల్ కమిషన్ నివేదిక ద్వారా మొత్తం అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. ఆ నివేదికలో ఉన్న వివరాలు, సూచనలను పరిశీలించిన తర్వాతే కేసును సీబీఐకి అప్పగించాం. ఇప్పుడు న్యాయపరంగా సమగ్ర విచారణ జరుగుతుంది” అని స్పష్టం చేశారు.

అలాగే, సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాలు బయటపడతాయని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ కేసుపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version