Latest Updates
భార్య విడాకుల బాధతో మద్యంలో మునిగి మరణించిన వ్యక్తి
థాయ్‌లాండ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రేయాంగ్కు చెందిన థవీసక్ నామ్వంగ్సా అనే 44 ఏళ్ల వ్యక్తి భార్య విడాకులు ఇచ్చిన విషాదాన్ని తట్టుకోలేక మద్యం సేవించడం ప్రారంభించాడు. విడాకుల సమయంలో తన 16 ఏళ్ల కుమారుడిని కూడా అతడి వద్దే వదిలి వెళ్లిపోయింది.
విడాకుల తరువాత నామ్వంగ్సా తీవ్ర మనోవేదనతో జీవితం గడిపాడు. ఆహారం తీసుకోవడం మానేసి, బీర్లపై ఆధారపడటం ప్రారంభించాడు. కుమారుడు ఎంతో ఒత్తిడితో భోజనం పెట్టినప్పటికీ తండ్రి తినే స్థితిలో ఉండలేకపోయాడు. ఇలా వరుసగా బీర్లు తాగడం వల్ల ఆయన ఆరోగ్యానికి గండిపడి, చివరికి మరణించాడు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గదిలో వందలాదిగా ఖాళీ బీరు బాటిళ్లు కనిపించాయి. నామ్వంగ్సా మద్యం వ్యసనం ఎలా ప్రాణాల మీదకు తెచ్చిందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.