Latest Updates
భారీ వర్షాల కారణంగా వైద్య సిబ్బందికి సెలవులు రద్దు.!
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి వచ్చే మూడు రోజులపాటు ప్రభుత్వం అన్ని రకాల సెలవులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు, గర్భిణులకు తక్షణమే అవసరమైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.