Andhra Pradesh
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950కు చేరింది. గమనార్హంగా, కేవలం ఐదు రోజులలోనే బంగారం ధర రూ.3,440 పెరిగింది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 ఎగబాకి రూ.96,200కు చేరింది. KG వెండి ధర కూడా రూ.1,100 పెరిగి రూ.1,31,000కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు సుమారుగా ఇదే స్థాయిలో ఉన్నాయి.