International
భారత్‌పై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ సవాల్
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్’ టోర్నమెంట్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్యపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్రంగా స్పందించారు.
భారత నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన మాట్లాడుతూ –
“ఇండియా ఈ మ్యాచ్ రద్దు చేసి ఏం నిరూపించాలనుకుంటోంది? ఇది ఒక్క మ్యాచ్ విషయంలో మాత్రమే కాదు. నిజమైన దేశభక్తి చూపించాలంటే వరల్డ్ కప్, ఒలింపిక్స్, అలాగే ఎలాంటి ICC ఈవెంట్స్‌లోనూ పాకిస్తాన్‌తో ఆడమని తేల్చుకుని ప్రకటించండి. అప్పుడు మీరు చూపించే దేశభక్తి ఏమిటో అందరికీ తెలుస్తుంది” అని సూటిగా సవాలు విసిరారు.