Latest Updates

బీఆర్ఎస్ కాదు, డీఆర్ఎస్: సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

CM Revanth Reddy: బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావు.. ఇక పరిపాలనపైనే మా దృష్టంతా: సీఎం  రేవంత్ రెడ్డి - Telugu News | CM Revanth Reddy chit chat on Loksabha  Elections 2024 | TV9 Telugu

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శిస్తుంటే, పార్టీ అధినేత కేసీఆర్ నోరు విప్పలేని స్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ను “దెయ్యాల రాజ్య సమితి (డీఆర్ఎస్)” అని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు.

పదేళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని బొందలగడ్డగా మార్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి, అక్కడి ఇళ్లను కూలగొట్టి, తమ సొంత ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ఎర్రవల్లికి రోడ్డు నిర్మించుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, తమ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే దిశగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version