National
బాలికపై కత్తితో దాడి యత్నం.. చాకచక్యంతో తప్పిన ప్రమాదం
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది చేసిన దాడి కలకలం రేపింది. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ 10వ తరగతి బాలికపై దాడికి తెగబడ్డాడు. పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను నడిరోడ్డుపై అడ్డగించి మెడపై కత్తి పెట్టి ప్రాణాలు తీసేస్తానంటూ బెదిరించాడు.
చుట్టుపక్కల ఉన్నవారు అతడిని నిలిపేందుకు యత్నించినా, అతను వారు చెప్పినదే వినలేదు. అయితే ఓ వ్యక్తి చాకచక్యంగా అతడి వెనుక నుంచి వచ్చి అతన్ని అడ్డుకుని బాలికను రక్షించాడు. వెంటనే ఇతరులు కూడా కలసి స్పందించడంతో బాలికను సురక్షితంగా విడిపించారు. అనంతరం ఆ దుండగుడిని బంధించి తీవ్రంగా చితకబాదారు. చివరికి అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.