Latest Updates

బండి సంజయ్ టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్?

సీఎం రేవంత్‌పై నాకు నమ్మకముంది: బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Central  Minister Bandi Sanjay Interesting Comments Over Telangana Politics | Sakshi

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంజయ్‌కు సన్నిహితుడైన ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు వెల్లడించారు.

సిట్ అధికారులు ఇటీవల ప్రవీణ్ రావుకు నోటీసులు జారీ చేసి, స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. 317 జీవో నిరసనలు, పదవ తరగతి పేపర్ లీక్, భైంసా అల్లర్ల సమయంలో ప్రవీణ్ రావు బండి సంజయ్‌కు అనుసరణగా ఉండటంతో అతని ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత రాజకీయ సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version