Latest Updates
ప్రయాణికుడి కోసం రైలు వెనక్కు: ట్రాజిక్ ఘటన ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా మార్కాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వాసి హరిబాబు (35) రాత్రి సమయంలో రైలు కుదుపుల్లో చిక్కుకుని కింద పడిపోయాడు.
సహచరులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. లోకో పైలట్లు అధికారులు అనుమతితో రైలును సుమారు 1.5 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్ళి, హరిబాబును బోగీలోకి ఎక్కించి మార్కాపుర్ స్టేషన్‌లో దింపారు.
అయితే ఆస్పత్రికి తరలించినప్పటికీ హరిబాబు పరిస్థితి విషమించి మృతిచెందాడు.