Latest Updates
ప్రభాకర్ రావు లొంగిపోవడం పథకం ప్రకారమే: బండి సంజయ్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవడం వెనుక పథకం ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతం చేయాలని అధికారులను బండి సంజయ్ డిమాండ్ చేశారు.