Andhra Pradesh

పార్వతీపురం: కూరగాయలపై 5% రాయితీ – వ్యాపారుల కొత్త ఆలోచన ప్రశంసనీయం

పార్వతీపురంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే వినూత్న ప్రయత్నం మొదలైంది. ఇక షాపుల్లో ప్లాస్టిక్ సంచుల బదులు వస్త్రం లేదా నార సంచులను ఉపయోగించే కొనుగోలుదారులకు 5 శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి, ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని భావిస్తున్నారు. వ్యర్థాలు సమస్యగా కాకుండా, ఆస్తిగా మారితే సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించవచ్చు. ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

ప్రతి షాపులో ఈ రాయితీ గురించి ప్రకటనలు పెట్టి, ప్రజలను వస్త్ర/నార సంచులను వాడమని అధికారులు, వ్యాపారులు ఉత్సాహపరిస్తున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛతతోనే బంగారు ఆంధ్రప్రదేశ్ సాధ్యమని, ప్రజల కలిసికట్టుగా పాల్గొనడమే కీలకం అని చెప్పారు.

అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ చేయడమే కాకుండా ప్రజలు ప్లాస్టిక్ వాడకం గురించి తెలుసుకోవడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రజలు చెత్తను సరిగ్గా వేరు చేయడం ద్వారా రోడ్లపై చెత్త కనిపించదని ముఖ్యమంత్రి చెప్పాడు. ప్రజలు ఇంటి చెత్తను సరిగ్గా నిర్వహించినప్పుడు వారికి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నాడు.

ఈ వినూత్న కార్యక్రమం విజయవంతమైతే, ఇతర పట్టణాలకు కూడా విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛత సాధన కార్యక్రమాలు, ప్రజల అవగాహన పెంచడం ద్వారా రాష్ట్రాన్ని సకలంగా ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.

#Parvathipuram #PlasticFreeInitiative #ClothBags #JuteBags #5PercentDiscount #EnvironmentalProtection #CleanAndGreenAP #ChandrababuNaidu #CircularEconomy #PlasticFreeAP #PlasticFreeIndia #WasteToResource #GreenInitiative #SustainableLiving #PublicAwareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version