Latest Updates
రేట్ రేషనలైజేషన్ ప్రభావం: తెలంగాణకు భారీ నష్టం ప్రమాదం
రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే అవకాశముందని డిప్యూటీ సీఎం భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దేశం బాగుండాలంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుండాలని గుర్తుచేసిన భట్టి, ఫెడరల్ స్పూర్తితో కేంద్రం వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రాలకు కలిగే నష్టానికి పరిహారం చెల్లించేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తమ డిమాండ్లను బలంగా వినిపించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.