Andhra Pradesh
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’ నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ రాబోతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్‌ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కన్మని’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ మెలోడీ సాంగ్‌ను ఆగస్టు 16న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అప్డేట్తో అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.
ఈ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ మాస్ బీట్తో అభిమానులను అలరించింది. దానికి పూర్తి భిన్నంగా ‘కన్మని’ రొమాంటిక్ అండ్ మెలోడీ ఫీల్‌తో సాగనుందని మ్యూజిక్ టీమ్ హింట్ ఇచ్చింది. పవన్-ప్రియాంక జంట కెమిస్ట్రీ ఈ సాంగ్‌లో హైలైట్ కానుందని టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే ‘OG’పై పవన్ అభిమానుల్లో ఏకైక ఫోకస్ కొనసాగుతోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషనల్ కంటెంట్ కూడా బలంగా ఉండబోతోందని ఇప్పటికే టీమ్ తెలిపింది. థమన్ అందిస్తున్న మ్యూజిక్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈరోజు రిలీజ్ కానున్న ‘కన్మని’ సాంగ్ ఆ క్రేజ్‌ను మరింత రెట్టింపు చేస్తుందనే నమ్మకం టీమ్ వ్యక్తం చేస్తోంది.