Andhra Pradesh

పవన్ కళ్యాణ్ విజ్ఞాస అద్భుతం.. యువతకు మార్గదర్శకత: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన గుర్తింపుతో వార్తల్లో నిలిచారు. జపాన్‌కు చెందిన పురాతన కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొంది ఆయన ప్రత్యేక ఘనత సాధించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై రాజకీయ, సినీ రంగాల ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌లోని నేర్చుకోవాలనే తపన అసాధారణమని, ఆయన జిజ్ఞాస నేటి యువతకు స్ఫూర్తిదాయకమని నారా లోకేష్ ప్రశంసించారు. సినీ రంగంలో పవర్ స్టార్‌గా ఎదిగి, రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించినప్పటికీ నిరంతరం కొత్త అంశాలను అన్వేషించాలనే తత్వం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే ఆయన యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. చెన్నైలో ఉన్న సమయంలో క్రమశిక్షణతో సాధన కొనసాగిస్తూ, జపనీస్ సమురాయ్ మార్షల్ ఆర్ట్స్‌ను లోతుగా అధ్యయనం చేశారు. ఆ అనుభవాన్ని సినిమాల్లోనూ ప్రతిబింబించి, మార్షల్ ఆర్ట్స్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు.

ఈ రంగంలో పవన్ కళ్యాణ్ చూపిన నిబద్ధత, పరిశోధన, అంకితభావానికి గుర్తింపుగా కెనిన్ కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆయనకు కెంజుట్సు ప్రవేశాన్ని అధికారికంగా అందించింది. ఈ గౌరవాన్ని డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్ధిక్ మహమూదీ పవన్ కళ్యాణ్‌కు ప్రదానం చేశారు.

ఈ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సహా పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో పాటు వ్యక్తిగత ఆసక్తులను సమానంగా కొనసాగిస్తూ, నిరంతరం అభివృద్ధి చెందాలనే పవన్ కళ్యాణ్ ఆలోచన యువతకు ఆదర్శంగా నిలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

#PawanKalyan#DeputyCM#Kenjutsu#JapaneseSwordArt#MartialArts#NaraLokesh#YouthInspiration#PowerStar#JanaSena
#APPolitics#FilmAndPolitics#RareAchievement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version