International

‘నేను ఎంతకాలం ఉంటానో తెలీదు’…. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్‌ను మృత్యువు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఫ్లోరిడాలోని తన నివాసం మార్-ఎ-లాగో’ వద్ద జరిగిన హత్యాయత్నం ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనను అంతమొందించేందుకు అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, తాను ఎంతకాలం జీవిస్తానో తెలియని అనిశ్చితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ పట్టుకుని ట్రంప్ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అత్యంత అప్రమత్తంగా ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని హెచ్చరించారు. అయితే ఆ దుండగుడు ప్రతిఘటించడంతో భద్రతా సిబ్బంది అతడిని అక్కడికక్కడే కాల్చి చంపారు.

 సాధారణ అధ్యక్షులపై దాడులు జరగవని, దేశ గతిని మార్చే అసాధారణ నేతల్నే టార్గెట్ చేస్తారని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీలను గుర్తు చేసుకున్నారు,గతంలో పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తూటా చెవిని తాకుతూ వెళ్లిన ఘటన, పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో రైఫిల్‌తో దొరికిన అనుమానితుడి ఉదంతాలను ఆయన ప్రస్తావించారు,ఎన్ని బెదిరింపులు వచ్చినా, తన ప్రాణాలకు ముప్పు ఉన్నా.. అమెరికా ప్రయోజనాల కోసం తాను తీసుకునే కఠిన నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రస్తుతం ట్రంప్ నివాసం వద్ద భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా ఆయనపై నిరంతరం దాడులు జరుగుతుండటం భద్రతా సంస్థలకు సవాలుగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version