Latest Updates

నిమజ్జనం.. సాగర సంబరం

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పై బిగ్ అప్‌డెట్

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల మహత్తర ఘట్టానికి నగరం సాక్ష్యమివ్వబోతోంది. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర, బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. నగరంలోని భారీ గణనాథుడి విగ్రహాలు ఊరేగింపుల రూపంలో గంగఒడికి చేరబోతున్నాయి.

విద్యాలయాలు, పలు ప్రైవేట్‌ మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. లక్షలాదిమంది నిమజ్జనోత్సవం కోసం చేరుకునే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 30 వేలమంది పోలీసు సిబ్బంది భద్రతా బందోబస్తులో పాల్గొంటున్నారు.

ఈ రోజు, రేపు ట్యాంక్‌బండ్‌ పరిసరాలు జనసందోహంతో కిటకిటలాడనున్నాయి. సాగరంలో జరిగే ఈ సంబరాలు ఆకాశాన్నంటే ఉత్సాహాన్ని నింపనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version