International

ధోనీకి బీసీసీఐ నుండి ఫుల్‌టైమ్ మెంటర్ ఆఫర్?

ICC World T20: BCCI makes MS Dhoni mentor of Team India

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ఓ ప్రత్యేక ఆఫర్ ఇచ్చిందని క్రిక్ బ్లాగర్ సమాచారం వెల్లడించింది.

గతంలో, 2021 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆయన పాత్ర కేవలం పార్ట్ టైమ్ మెంటర్గానే పరిమితమైంది.

ఈసారి మాత్రం బీసీసీఐ, ధోనీని ఫుల్‌టైమ్ మెంటర్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కేవలం పురుషుల జట్టుకే కాకుండా సీనియర్, జూనియర్ జట్లుతో పాటు మహిళల టీమ్స్‌కూ ఆయన మార్గదర్శకత్వం అందించాలని ప్రతిపాదన ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఈ ఆఫర్‌ను ధోనీ అంగీకరిస్తే, భవిష్యత్తులో భారత క్రికెట్‌లో ఆయన పాత్ర మరింత కీలకంగా మారనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version