Entertainment

తాజా సినీ ముచ్చట్లు

NTR Prashanth Neel movie Dragon regular shooting will begin in January 2025  | Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్  స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తాజాగా ధృవీకరణ లభించింది. చెన్నైలో జరిగిన ‘మదరాసి’ మూవీ ఈవెంట్‌లోనే ఈ వార్త బయటపడటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతుండగా, పాన్-ఇండియా లెవెల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్డేట్ రానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండగా, ఈ అప్డేట్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజ్‌గా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఇప్పటికే ట్రెండ్ స్టార్ట్ చేసి వేడిని పెంచుతున్నారు.

వెంకటేశ్, రవితేజ కొత్త సినిమాల చర్చ

టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ మళ్లీ మాస్ డైరెక్టర్ వివి వినాయక్తో జోడీ కట్టనున్నారని సమాచారం బయటకు వచ్చింది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణతో మాస్ మహారాజా రవితేజ ఒక థ్రిల్లర్ మూవీ చేయనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ రెండు కాంబినేషన్లు ఫైనల్ అయితే టాలీవుడ్ ప్రేక్షకులకు పక్కా మాస్ ట్రీట్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version