International

ట్రంప్ వ్యాఖ్యలపై భారత ఆర్మీ సూటిగా స్పందన

How to become a Field Marshal? Know all about the highest attainable rank  in the Indian Army - Times of India

ట్రంప్ వ్యాఖ్యలపై భారత ఆర్మీ సూటిగా స్పందన
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ కారణమన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ట్రంప్ తాజాగా చేసిన ఆరోపణలపై భారత ఆర్మీ నుండి గట్టి కౌంటర్ వచ్చింది. ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ అధికారికంగా ఒక పాత పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 1954 నుంచి 1971 మధ్యకాలంలో అమెరికా పాకిస్తానుకు అందించిన ఆయుధ సహాయంపై ఆ క్లిప్పింగ్ స్పష్టంగా ప్రస్తావించింది.

అమెరికా ద్వంద్వ రాజకీయాలను గుర్తు చేసిన భారత సైన్యం
ఆ పేపర్ క్లిప్పింగ్ ప్రకారం, అమెరికా నుండి అందిన ఆయుధాలతో పాకిస్తాన్ అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో సివిలియన్లపై దాడులు చేసింది. దీంతో అమెరికా నాటి నుంచి ఒకపక్షపాత రాజకీయాలను కొనసాగిస్తూ ఉందని స్పష్టమవుతోంది. యుద్ధాలను విమర్శించాల్సిన స్థానంలో, ఒకప్పుడు యుద్ధానికి బాసటగా నిలిచిన అమెరికా ఇప్పుడు భారత్‌ను ఉద్దేశించి విమర్శించడం వింతగా ఉందని భావిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఈస్టర్న్ కమాండ్ ట్వీట్ హాట్ టాపిక్
ఈస్టర్న్ కమాండ్ పోస్టు చేసిన పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, భారత ఆర్మీ స్పందనను ప్రశంసిస్తున్నారు. ట్రంప్ మాటలు నిరాధారమని, అమెరికా తన గత చరిత్రను ముందుగా చూసుకోవాలంటూ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో, భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు అంతగా నిలవవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version