International

ట్రంప్‌కు కోర్టు షాక్: అక్రమ వలసదారుల తరలింపు చట్టవిరుద్ధం.. కీలక తీర్పు వెలువరించిన న్యాయమూర్తి!

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయోగించిన అస్త్రంపై న్యాయస్థానం స్టే విధించింది. వలసదారులను వారికి ఏమాత్రం సంబంధం లేని మూడో దేశాలకు తరలించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.అక్రమ వలసదారులను గ్వాటమాలా, దక్షిణ సూడాన్ వంటి దేశాలకు పంపాలన్న ట్రంప్ ఆదేశాలను మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ తాత్కాలికంగా నిలిపివేశారు,తగిన సమయం ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు లేకుండా వారిని తెలియని దేశాలకు పంపడం వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అమెరికా గడ్డపై ఉన్న ఏ వ్యక్తికైనా, చట్టపరమైన ప్రక్రియ (Due Process) లేకుండా వారి స్వేచ్ఛను హరించకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు మరోసారి గుర్తు చేసింది,అప్పీల్‌కు గడువు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ట్రంప్ యంత్రాంగానికి కోర్టు 15 రోజుల సమయం ఇచ్చింది.రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ట్రంప్ ‘మాస్ డిపోర్టేషన్’ (భారీ తరలింపు) కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అయితే, ఇప్పటికే ప్రతీకార సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేయగా, ఇప్పుడు వలసల విషయంలో కూడా ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version