Latest Updates
టెస్లా భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది – అసలేమిటి ప్లాన్?
ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లూ భారత ప్రభుత్వం విధిస్తున్న అధిక దిగుమతి సుంకాలను అడ్డంకిగా చూపుతూ భారత మార్కెట్లోకి రావడం ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు, టారిఫ్‌లు ఉన్నా కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి టెస్లా ముందుకొచ్చింది. దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత మార్కెట్‌లో టెస్లా ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కీలక వ్యూహం దాగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారీ జనాభా, పెరుగుతున్న ఈవీ డిమాండ్, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు టెస్లాను ఆకర్షించిన అంశాలుగా చెబుతున్నారు. దీంతోపాటు, భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా గ్లోబల్ ఎక్స్‌పోర్ట్‌కు దోహదపడే అవకాశాలను టెస్లా గమనించినట్టుగా తెలుస్తోంది