Business

టెస్లా ఆటోపైలట్ పై అమెరికా కోర్టు సీరియస్ వ్యాఖ్యలు – రూ.2,100 కోట్లు నష్టపరిహారం

Tesla spars in court over autopilot alert 2 seconds before crash

టెస్లాకు భారీ జరిమానా వేయిస్తూ అమెరికా ఫ్లోరిడాలోని కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో టెస్లా వాహనంలో ఉన్న ఆటోపైలట్ వ్యవస్థ లోపంతోనే ప్రమాదం చోటుచేసుకున్నదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో బాధితుల తరఫున న్యాయపరంగా పోరాడిన కుటుంబానికి న్యాయం చేస్తూ కోర్టు, టెస్లా కంపెనీ రూ.2,100 కోట్ల (సుమారు 242 మిలియన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ప్రమాద వివరాల్లోకి వెళ్తే… 2019లో ఫ్లోరిడాలోని ఓ రహదారిపై టెస్లా వాహనం అధిక వేగంతో వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోపైలట్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు నియంత్రణ కోల్పోయిందని విచారణలో తేలింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా… మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోర్టులో విచారణ సందర్భంగా టెస్లా ఆటోపైలట్ వ్యవస్థకు సంబంధించి పలు లోపాలు వెల్లడయ్యాయి. అవి కంపెనీ నిర్లక్ష్యమేనని కోర్టు అభిప్రాయపడింది.

ఈ తీర్పుపై టెస్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అప్పీల్‌కు సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ ఆటోపైలట్ సాంకేతికతపై పూర్తి నమ్మకముందని కంపెనీ చెబుతోంది. అయినప్పటికీ గత కొద్ది కాలంగా టెస్లా ఆటోపైలట్ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ తీర్పు టెస్లాకు గట్టిన షాక్‌లా మారింది. భవిష్యత్‌లో ఆటోపైలట్ ఆధారిత వాహనాల భద్రతపై మరింత ప్రశ్నలు తలెత్తే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version