International

టీ20లకు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్

Most runs conceded in an over by an Australian bowler: Mitchell Starc sets  unwanted ODI record after Liam Livingstone carnage | Sporting News India

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. టెస్టులు, వన్డే మ్యాచ్‌లపై పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని స్టార్క్ వెల్లడించారు.

టీమ్ ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్, యాషెస్ పోరాటం, అలాగే 2027 వన్డే ప్రపంచకప్ తనకు అత్యంత ప్రాధాన్యమని ఆయన అన్నారు.

35 ఏళ్ల స్టార్క్ ఇప్పటివరకు 65 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 79 వికెట్లు పడగొట్టారు. తన వేగవంతమైన యార్కర్లతో అగ్రశ్రేణి బ్యాటర్లను సైతం ఇబ్బందులకు గురి చేసిన స్టార్క్, చిన్న ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version