Entertainment

టిమ్ డేవిడ్ తుఫాను.. ఒక్క ఓవర్‌లోనే 28 రన్స్!

WATCH: Tim David Smashes 28 off Just 8 Balls as Australia Register  Thrilling Win in Chase of 216 vs NZ | Cricket News - News18

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ చెలరేగాడు. క్రీజులోకి వచ్చి కొద్దిసేపటికే భారీ హిట్స్‌కు తెరలేపాడు. ముఖ్యంగా 10వ ఓవర్‌లో వెస్టిండీస్ బౌలర్ గూడకేశ్ మోతీపై విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచిన డేవిడ్, రెండో బంతిని డాట్‌కు గురైనా తర్వాత వరుసగా నాలుగు సిక్సర్లతో ఆఖరి నాలుగు బంతుల్లో 24 రన్స్ కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి.

అంతే కాకుండా తర్వాతి రెండు ఓవర్లలోనూ అతడి ఆట అదే ఊపుతో సాగింది. 11వ ఓవర్లో 20, 12వ ఓవర్లో 23 పరుగులు రాబట్టిన ఆస్ట్రేలియా.. కేవలం 18 బంతుల్లోనే 71 పరుగులు సాధించింది. ఇందులో ఎక్కువ భాగం టిమ్ డేవిడ్ బ్యాట్‌ నుంచి వచ్చినట్లు చెప్పొచ్చు. అతని విధ్వంసాత్మక ఆటతో స్కోరు బోర్డు వేగంగా పెరిగింది. టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు ముందు ఇలా ఫామ్‌లోకి రావడం ఆసీస్‌కు బలాన్ని ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version