Business

జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్..

భారతదేశపు నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రారంభించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తూ జియో ఉచితంగా AirFiber సేవలను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ నేటి నుండి ప్రారంభమైంది. నవంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు.

భారతదేశపు నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రారంభించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తూ జియో ఉచితంగా AirFiber సేవలను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ నేటి నుండి ప్రారంభమైంది. నవంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు జియో ఈ సరికొత్త వ్యూహం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ కస్టమర్‌లు కూడా ఒక సంవత్సరం పాటు ఉచిత సేవలను పొందవచ్చు.

Jio AirFiber ఉచితంగా పొందడం ఎలా?

ఏదైనా రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్‌లో కనీసం రూ. 20,000 విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ డిజిటల్‌లో టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ మొదలైన వివిధ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ, మీరు రూ. 20,000 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, మీరు ఒక సంవత్సరం పాటు ఉచిత జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీస్‌ను పొందవచ్చు.

అలాగే, ఇప్పటికే జియో ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్ ఉన్నవారు కూడా ఒక సంవత్సరం ఉచిత సేవను పొందడానికి అర్హులు. రూ. 2,222 విలువైన 3 నెలల దీపావళి ప్లాన్‌కు ఒక సంవత్సరం ప్రీ-సర్వీస్ లభిస్తుంది.

రూ.50 చెల్లిస్తే ఉచిత కనెక్షన్

మీరు రిలయన్స్ జియో వెబ్‌సైట్ ద్వారా ఉచిత జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని పొందవచ్చు. 50 చెల్లిస్తే ఉచిత కనెక్షన్ లభిస్తుంది. రూటర్ నుండి ప్రతిదీ ఇక్కడ ఉచితంగా ఇన్‌స్టాల్ చేస్తారు. ఆ తర్వాత ఏదైనా ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఇక్కడ ప్లాన్‌లు నెలకు రూ. 599 నుండి ప్రారంభమవుతాయి. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 30 Mbps వరకు ఇంటర్నెట్ వేగం, 13 OTT మొదలైనవి ప్రాథమిక ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version