Environment

జపాన్ తీరానికి భారీ తిమింగలాల దండయాత్ర: సునామీ ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు

జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ | Japan Issues Tsunami Warning In  Izu And Ogasawara Pacific Ocean, Check Weather Condition Updates | Sakshi

రష్యా సమీపంలో సంభవించిన తీవ్ర భూకంపం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో భారీ అలలు ఏర్పడి, జపాన్ తీరాన్ని అల్లకల్లోలంగా మార్చాయి. ముఖ్యంగా చింబా తీర ప్రాంతానికి రాకాసి తరహా సునామీ అలలు ఎదురయ్యాయి. ఈ ప్రభావంతో భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చిన దృశ్యాలు వీడియోల రూపంలో వైరల్‌గా మారాయి. సముద్రపు జీవావరణంపై ఈ ప్రకృతి ప్రకోపం తీవ్ర ప్రభావం చూపించినట్లు నిపుణులు చెబుతున్నారు.

సునామీ ప్రభావం కారణంగా చింబా తీరంలో వినూత్నమైన దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా లోతైన సముద్రాల్లో ఉండే భారీ తిమింగలాలు ఒక్కసారిగా ఒడ్డుకు చేరుకోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తిమింగలాలు కొట్టుకొచ్చిన ప్రాంతంలో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడగా, పరిస్థితిని మొబైల్ ఫోన్లలో బంధిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూసినవారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇక సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల వద్ద ప్రజలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చింబా సమీపంలోని సెండాయ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం సైతం హైఅలర్ట్‌లోకి వెళ్లింది. భవిష్యత్తులో ఇంకా ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version