Business

గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త: RBI కొత్త మార్గదర్శకాలు

Gold Loan: భారీ గుడ్ న్యూస్ చెప్పిన RBI.. బంగారంపై తక్కువ వడ్డీకే ఎక్కువ  లోన్.. | RBI Hikes Gold Loan LTV to 85 percentage Get Bigger Loan at Lower  Interest

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త వినిపించారు. త్వరలో గోల్డ్ లోన్‌లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రూ.2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతం నుంచి 85 శాతానికి సవరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సవరణతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే వారు మరింత ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గోల్డ్ లోన్‌ల విషయంలో బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC)లకు ఏకరీతిలో మార్గదర్శకాలు అమలులో ఉండేలా RBI చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం గోల్డ్ లోన్ తీసుకునే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు, రుణ విధానాల్లో సమన్వయం మరియు పారదర్శకతను పెంచనుంది.

ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తే, గోల్డ్ లోన్ మార్కెట్‌లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version