Latest Updates
గద్వాలలో దారుణం: పెళ్లైన నెలకే భర్త హత్య
జోగులాంబ గద్వాల జిల్లాలో పెళ్లైన కేవలం నెల రోజులకే భర్తను హత్య చేసిన దారుణ ఘటన సంచలనం రేపింది. గద్వాలకు చెందిన తేజేశ్వర్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు మే 18న వివాహం జరిగింది. జూన్ 17న తేజేశ్వర్ అనుమానాస్పదంగా అదృశ్యమై, నిన్న పాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత, ఆమె పనిచేసే బ్యాంకులోని ఓ ఉద్యోగితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఆ వ్యక్తి ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకోగా, వీరు ముగ్గురూ కలిసి తేజేశ్వర్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య, సుజాత, ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనుక కారణాలను రాబట్టేందుకు ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, దోషులకు కఠిన శిక్ష పడాలని కుటుంబం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేశారు.