Latest Updates
ఖర్గేకు క్షమాపణలు చెప్పిన జేపీ నడ్డా
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అసభ్య వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనకు ముందే ప్రధాని జమ్మూ కశ్మీర్ పర్యటనను రద్దు చేశారంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా, ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఆయన మతిస్థిమితం కోల్పోయారు’ అని విమర్శించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నడ్డా ఖర్గేకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నడ్డా చివరికి ఖర్గేను అభ్యర్థిస్తూ క్షమాపణలు చెప్పారు.