International

ఖతర్‌ బహుమతిపై వివాదం: ట్రంప్‌ ధీటుగా స్పందన

ట్రంప్‌కు ఖతార్‌ నుంచి విలాసవంతమైన జంబో జెట్ బహుమతి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖతర్‌ నుండి విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా స్వీకరించిన విషయంలో తలెత్తిన విమర్శలపై స్పందిస్తూ, తాను మూర్ఖుడిని కాదని, దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఈ విమానం తీసుకోవడం వల్ల అమెరికా అంతర్జాతీయ స్థాయిలో సానుకూల సంకేతం పంపిందని ట్రంప్ పేర్కొన్నారు. ఖతర్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాల ప్రతీకగా ఈ బహుమతిని చూయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విమానం భద్రతాపరంగా ఏవైనా సమస్యలు కలుగుతాయన్న విమర్శలను ట్రంప్ ఖండించారు. “విమానం అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఇది అమెరికా భద్రతా సంస్థల ద్వారా పూర్తిగా పరిశీలించబడింది,” అని ఆయన స్పష్టం చేశారు. విమర్శకులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కావాలనే తప్పుదారి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ విమానాన్ని తన పదవీ కాలం ముగిసిన తర్వాత అధ్యక్ష లైబ్రరీకి విరాళంగా ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ఈ విమానం అమెరికా చరిత్రలో ఒక భాగంగా నిలిచి, దేశ గొప్పతనం మరియు అంతర్జాతీయ స్నేహాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బహుమతి విషయంలో ట్రంప్ నిర్ణయం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన నిర్ణయం అమెరికా-ఖతర్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version