Telangana

కేవలం రూ.150కి గెలుచుకోండి గొర్రెపోతు & ఫుల్ బాటిల్ – సూర్యాపేట స్పెషల్!

Lucky Draw

పండుగ టైమ్ అంటేనే మార్కెట్‌లో హడావిడి వాతావరణం. చిన్న పెద్ద వ్యాపారాలన్నీ ఎలా ఆకర్షించాలి? అనే ఆలోచనలతో వినూత్న ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. అలా సూర్యాపేటలోని ఓ చికెన్ అండ్ మటన్ షాప్ యజమాని వినూత్నంగా లక్కీ డ్రా ప్లాన్ చేసి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.

“జానీ చికెన్ & మటన్ సెంటర్” పేరు చెప్పగానే ఇప్పుడు స్థానికుల్లో ఆసక్తి పుట్టిస్తోంది. కారణం – కేవలం రూ.150కి కూపన్ కొంటే, దసరా పండుగ ఒక్క రోజు ముందు జరిగే డ్రాలో పాల్గొనొచ్చు. మొదటి బహుమతిగా 15 కిలోల బరువున్న గొర్రెపోతు, అదనంగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ గిఫ్ట్‌గా వస్తుంది. రెండో బహుమతికీ అదే ఫుల్ బాటిల్ రివార్డు ఉంది!

ఈ డ్రా కోసం కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో, టికెట్ల కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పటికే చాలా కూపన్లు సేలవయ్యాయని యజమాని నాగరాజు చెబుతున్నారు. “పండుగ సందర్భంగా వినోదంగా ఉంటూనే, కస్టమర్‌కు ఏదో ఒక బహుమతి అందాలన్నదే నా ఆలోచన” అంటున్నారు ఆయ‌న.

పల్లె ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు కొత్తకాదు కానీ, మాంసం – మద్యం కలిపిన ప్యాకేజీని లక్కీ గిఫ్ట్‌లుగా ఇవ్వడం మాత్రం అరుదైనది. ఒకే ఒక్క రోజు – అక్టోబర్ 1న ఫలితాలు ప్రకటించనున్న ఈ లక్కీ డ్రా గురించి స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే, భవిష్యత్తులో మరిన్ని చిన్న వ్యాపారాలు ఇదే తరహా ఆఫర్లను ఇవ్వొచ్చన్నది మార్కెట్ అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version