Andhra Pradesh
కుప్పంలో సీఎంను కలిసిన డెయిరీ ప్రతినిధులు: ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు హామీ
కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ మరియు మదర్ డెయిరీ ప్రతినిధులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో శ్రీజ సంస్థ ద్వారా పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్ మరియు మదర్ డెయిరీ ద్వారా పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు.
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యమని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టులను 15 నుంచి 18 నెలల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిధులను ఆదేశించారు. ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా స్థానిక రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంతో పాటు కుప్పం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.