Latest Updates

కాసేపట్లో వర్షం

Rain Alert: కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అల్టర్ |  Telangana heavy rainfall alert april 2025 VVNP

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రాత్రి 10 గంటలలోపు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మెదక్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నారాయణపేట, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే పిడుగులతో కూడిన వర్షం కూడా ఉండవచ్చని తెలిపింది.

ఈ వర్షాలతో పాటు గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే రహదారులపై ట్రాఫిక్ ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సలహా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version