Latest Updates

ఒకే ఇంట్లో 250 మంది ఓటర్లు.. EC క్లారిటీ ఇవ్వాలన్న జర్నలిస్టు

కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిలో ఈసీ - Navatelangana

బిహార్‌లోని ముజఫర్పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భగవాన్పూర్ ప్రాంతంలో ఒకే ఇంటి నంబర్‌పై 250 మంది ఓటర్లు ఉన్నారని జర్నలిస్టు అజిత్ అంజుమ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా (SIR డ్రాఫ్ట్) పరిశీలించగా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.

ఈ సంఖ్య ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని అంజుమ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ ఓటర్లు వివిధ కులాల వారని, వీరికి కలిపి 300 మంది పిల్లలు ఉంటే అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టే అవుతుందని వ్యంగ్యంగా అన్నారు. ఇది కేవలం ఒక ఇల్లా, లేక చిన్న గ్రామమా అన్న అనుమానం వ్యక్తం చేశారు.

ఈ అసాధారణ పరిస్థితిపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని ఆయన X (మాజీ ట్విట్టర్) వేదికగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో ఇలాంటి లోపాలు ఉన్నాయో లేదో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version