Latest Updates
ఐపీఎల్.. ఆ జట్టుకు హెడ్ కోచ్ వీడ్కోలు
ఐపీఎల్ 2026 ముందు మాజీ చాంపియన్ జట్టు KKRకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. 2022లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2024 సీజన్‌లో జట్టును విజేతగా నిలిపారు. అయితే 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయారు. తాజా సమాచారం ప్రకారం, KKR యాజమాన్యంతో జరిగిన చర్చల అనంతరం ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి హెడ్ కోచ్ ఎవరు అన్న ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది.