Telangana
ఏసీలు అవసరం లేని నగరం.. తెలంగాణ ఫ్యూచర్‌సిటీలో విప్లవాత్మక కూలింగ్ విధానం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాలంలో చిన్న కార్యాలయాలు, భారీ భవనాలు ఏసీని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాయి. ఇళ్లలో ఏసీల వినియోగం కూడా పెరిగిపోతోంది. కానీ, ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీలో ఏసీలు లేకుండా చల్లదనాన్ని అందించేందుకు కొత్త పద్ధతినీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఏసీల వినియోగం పెరుగుతూండగా, అదే సమయంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ (DCS)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న కొత్త నగరాలు, మాల్స్, టౌన్‌షిప్‌లలో విజయవంతంగా అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఆధునిక విధానాన్ని ఫ్యూచర్ సిటీలో చేర్చాలని భావిస్తోంది.
తెలంగాణ విజన్-2047 పత్రం ప్రకారం, ఫ్యూచర్ సిటీలో AI సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి కీలక విభాగాలను అభివృద్ధి చేస్తారు. మొత్తం నగరంలో సంప్రదాయ ఏసీల వినియోగం లేకుండా, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ద్వారా శీతలీకరణ అందించడమే లక్ష్యం. దీనివల్ల విద్యుత్ బుంటే మరియు పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ (DCS) అనేది కేంద్రీకృత శీతలీకరణ పద్ధతి. ఇందులో శుద్ధి చేసిన నీటిని సుమారు 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరిచి, పైపుల ద్వారా భవనాలకు సరఫరా చేస్తారు. భవనాల్లో ఉన్న ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఈ చల్లని నీటిని ఉపయోగించి గదులను చల్లబరుస్తాయి. గదుల నుంచి వచ్చే వేడి నీటిని తిరిగి శీతలీకరణ కేంద్రానికి పంపించి, మళ్లీ చల్లబరచి వినియోగంలోకి తీసుకొస్తారు. ఈ విధానం ద్వారా సాధారణ ఏసీలతో పోలిస్తే దాదాపు 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందులో, నగరాల్లో ఏసీల అధిక వినియోగం హీట్ ఐలాండ్ సమస్యను పెంచుతోంది. దీని కారణంగా వేసవిలో మరింత వేడి ఏర్పడి, మరిన్ని ఏసీలు అవసరమవుతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఫ్యూచర్ సిటీలో ప్రణాళికాబద్ధంగా DCS అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఈ విధానం విజయవంతంగా ఉంది. తెలంగాణలో పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్, ఐటీ కారిడార్‌లోని ఓ gated communityలోనూ ఇది అమలులో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో ఈ సాంకేతికత మరింత విస్తృతంగా అందుబాటులో రానుంది.