Andhra Pradesh

ఏపీ లిక్కర్ స్కాం: రూ.3,500 కోట్ల ముడుపుల గుట్టురట్టు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో 300 పేజీల చార్జ్‌షీట్.. మిథున్ రెడ్డి  అరెస్ట్ రేపు? | Ap liquor scam case sit submits preliminary charge sheet in  vijayawada acb court nk-10TV Telugu

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంలో దాదాపు రూ.3,500 కోట్ల వరకు ముడుపులు చేతులు మారినట్లు SIT (Special Investigation Team) చార్జ్‌షీట్‌లో వెల్లడైంది. ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసి, షెల్ కంపెనీల ద్వారా అవి చివరి లబ్ధిదారుల వరకు చేరినట్లు పేర్కొంది. అందులో రూ.200-300 కోట్లు 2024 ఎన్నికల ఖర్చులకు వినియోగించినట్లు విచారణలో తేలింది. మిగతా పెద్ద మొత్తం దుబాయ్‌కి తరలించారని, ఇందుకోసం విదేశీ షెల్ కంపెనీలను ఉపయోగించినట్లు SIT అధికారులు వెల్లడించారు.

ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వ అధికారులు, రాజకీయ అనుబంధాలు ఉన్న బ్రోకర్లు, లిక్కర్ ఏజెన్సీల డైరెక్టర్లు నిందితులుగా గుర్తించబడ్డారు. అయితే, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మున్ముందు మరికొంతమంది కీలక రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపే అవకాశముండగా, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version