Andhra Pradesh

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన సూచన.. ఈ రైళ్ల నంబర్లు మారాయి, తెలుసుకోండి.

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన సూచన.. ఈ రైళ్ల నంబర్లు మారాయి, తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో పలు రైళ్ల నంబర్లు మారాయి. తూర్పు కోస్తా అధికారులు ఓ ప్రకటనలో, విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్లే రైళ్ల నంబర్లను మార్చినట్లు తెలిపారు. అలాగే, దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని రైళ్ల నంబర్లను మార్చింది. ఏపీలో రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. తూర్పు కోస్తా మరియు దక్షిణ మధ్య రైల్వే మార్చిన రైళ్ల నంబర్ల వివరాలు ఇవి.

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. వచ్చే ఏడాదిలో కొన్ని తేదీల నుంచి రైళ్ల నంబర్ల మార్పులు అమలులోకి వస్తాయి. తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్‌లో కొన్ని రైళ్ల నంబర్లు మార్చినట్లు అధికారులు చెప్పారు. జనవరి 1 నుండి కొత్త నంబర్లు అమల్లో ఉంటాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ వెల్లడించారు.

విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలు: పాత రైలు నంబర్లు 08551, 08552.. కొత్త రైలు నంబర్లు 58501, 58502

విశాఖపట్నం-రాయపూర్-విశాఖపట్నం రైలు: పాత రైలు నంబర్లు 08528, 008527.. కొత్త రైలు నంబర్లు 58528, 58527

విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం రైలు: పాత రైలు నంబర్లు 08546, 08545.. కొత్త రైలు నంబర్లు 58538, 58537

విశాఖపట్నం-బ్రహ్మపూర్-విశాఖపట్నం రైలు: పాత రైలు నంబర్లు 08531, 08532.. కొత్త రైలు నంబర్లు 58532, 58531

విశాఖపట్నం-గుణుపూర్-విశాఖపట్నం రైలు: పాత రైలు నంబర్లు 08522, 09521.. కొత్త రైలు నంబర్లు 58506, 58505

విశాఖపట్నం-భవానీపట్నం-విశాఖపట్నం రైలు: old train నంబర్లు 08504, 08503.. New train నంబర్లు 58504, 58503

కటక్-గుణుపూర్-కటక్ పాత నంబర్లు పాత రైలు నంబర్లు రైలు: 08421, 08422.. కొత్త రైలు నంబర్లు 68433, 86434

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొన్ని రైళ్ల నంబర్లు మార్చబడాయి. ఈ మార్పులు మార్చి 1 నుండి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

17488 విశాఖపట్నం – కడప రైలు నంబరును 18521గా మార్చనున్నారు. 17487 కడప – విశాఖపట్నం రైలు నంబరును 18522గా మార్చనున్నారు.

22701 విశాఖపట్నం – గుంటూరు రైలు నెంబర్‌ను 22875గా.. 22702 గుంటూరు – విశాఖపట్నం రైలు నెంబర్‌ను 22876గా ఇచ్చారు.

20896 భువనేశ్వర్ – రామేశ్వరం రైలు నంబర్ 20895గా.. 20895 రామేశ్వరం – భువనేశ్వర్ రైలు నంబర్ 20896గా మారనుంది. 

12898 భువనేశ్వర్ – పుదుచ్చేరి రైలు నంబర్ 12897గా.. 12897 పుదుచ్చేరి – భువనేశ్వర్ రైలు నెంబర్ 12898గా మారనుంది. 

12830 భువనేశ్వర్ – చెన్నై సెంట్రల్ రైలు నంబర్ 12829గా.. 12829 చెన్నై సెంట్రల్ – భువనేశ్వర్ రైలు నంబర్ 12830గా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version