Environment

ఏనుగు కాదు… కుటుంబ సభ్యురాలిగా భావించిన మాధురి తరలింపు

Madhuri Elephant Vantara: Madhuri's Troubled Relocation

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ జైన మఠంలో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఏనుగు ‘మహాదేవి’ (మాధురి)ని గుజరాత్‌లోని వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అధికారులు తరలించారు. మఠం వారసత్వ సంపదగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నందున అక్కడ నివసించే ప్రతి అంశానికీ అనుబంధం పెరిగిన పరిస్థితిలో, మాధురి తరలింపు స్థానికులు, భక్తులను తీవ్రంగా కలిచివేసింది.

మాధురి అనే ఈ ఏనుగు చిన్నప్పటి నుంచే మఠంలో ఉంది. మఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, భక్తులకు ఆశీర్వాదం ఇవ్వడం వంటి ఆచారాల్లో భాగమవుతూ మానవులతో మనసుకి మనసుగా మమేకమైంది. ఇలాంటి ప్రాణితో కొల्हాపూర్‌ వాసులు గాఢంగా కట్టుబడి ఉండటంతో, అధికారులు తీసుకున్న తరలింపు నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మాధురిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దాదాపు 30 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టారు.

ఇక సోషల్ మీడియాలోనూ మాధురిపై ప్రేమాభిమానాలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది నెటిజన్లు మాధురితో తీయబడ్డ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె తిరిగి మఠానికి రావాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. “#BringBackMadhuri” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వన్యప్రాణి సంరక్షణ పరంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలే అయినా, మాధురిని ‘కుటుంబసభ్యురాలిగా’ భావించిన భక్తుల కోసం మరో పరిష్కార మార్గం ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version