News
ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ జులై 25 నుండి ఆగస్టు 10 వరకు జరగనుందని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అందులో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సన్నబియ్యం అందుబాటులో ఉండటంతో రేషన్ కార్డులపై ప్రజల్లో డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు.