News
ఇవి చెరిపేస్తే చెరిగేవి కావు: హరీశ్ రావు
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తాజాగా సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్‌తో ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదాద్రి, సెక్రటేరియట్ వంటి ప్రాంతాలను సందర్శించిన చిత్రాలను షేర్ చేస్తూ, తెలంగాణ అభివృద్ధిని హైలైట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుతమైన పాలనకు ఇవి సజీవ సాక్ష్యమని, భవిష్యత్ తరాలకు నిలిచే నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇంకా ఏమన్నారంటే, తెలంగాణలోని ఈ అభివృద్ధి చిహ్నాలు బీఆర్ఎస్ పాలనకు కీర్తి కిరీటాలని హరీశ్ రావు అన్నారు. ‘ఎవరు ఒప్పుకున్నా, తిరస్కరించినా.. ఈ సాధనలను ఎవరూ చెరపలేరు, దాచలేరు’ అంటూ సవాల్ విసిరారు. ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ అంటూ ఆయన తన పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.